1. "తిట్ల దండకం" :చిత్రం: "ష్ గప్ చుప్"
(1993)
ఒరేయ్ త్రాపీ! మహాపాపీ! కురూపీ! నిన్ను చూడంగనే
వచ్చు హై లెవెల్ బీ.పీ, ముండమోపీ! జిరాఫీ! నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపీ!
అంక ఛండాలుడా! బంక బధిరాంధుడా! పరమ పాపిష్ఠ నికృష్ఠ దుష్టాత్ముడా! నీ నీచ రూపంబు చూడంగ
పాపంబు, నీ కంఠ నాళంబు కక్కూసు గొట్టంబు, నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ పల్కులే
చెత్త, నీ జన్మ డ్రైనేజి! నువ్వో దగుల్బాజి, యేబ్రాసి, చప్రాసి, సన్నాసివీ! ఆశుధ్ధ
స్వరూపా! అబధ్ధ ప్రలాపా! పింగు బొంగైన పింజారిగా! కుత్తేకా బచ్చా! కొవ్వెక్కిన లుఛ్ఛా!
పగిలేను నీ పుచ్చె, తీరేను నా కచ్చ, నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా! భ్రష్టాతి
భ్రష్టా! పరాకాష్ఠ కెళ్ళావు దుష్టత్వమందున్,
ముదనష్ఠుడా1 త్రాష్ఠుడా! కుష్ఠు ముష్ఠోడి అంగుష్ఠమా! వృధ్ధ క్షయరోగి ఉఛ్ఛిష్టమా! ఒరేయ్ పళ్ళ కిచ్చీ! అరేయ్
చిల్లి గోచీ! నీ పిచ్చి పోగొట్టగా టచ్చి యిస్తాను పెంటచ్చిగా, పెన్ టచ్చిగా! ఒరేయ్
పాచి ముఖమా! నడుస్తున్న శవమా! వేడి ఇడ్లీలు
పారేయకన్ సద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరిగా!
పెద్ద ఇడియట్టువీ, చద్ది పెసరట్టువీ, పిచ్చి
టేస్టున్న శాడిస్టువీ, గజ్జి పాదాల మరగుజ్జువీ,
ఉచ్ఛనీచాలు లేనట్టి రాస్కేలువీ, తేలువీ! ఒరేయ్ అక్కుపక్షీ! నిరక్షరకుక్షీ! కుంకాక్షి!
ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా! నువ్వు చుంచెలుక
గొద్దెవీ, రాబందు రెట్టవీ, బొద్దింక కేశానివీ, సీంపందిమూతివీ, గబ్బిలం తోకవీ, ఏకాకి
కాకీకవీ! న్యూసెన్సు డాంకీవి, నోసెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవీ! మునిసిపాలిటీ
పందికిన్ మోక్షగుండానివి, ఎద్దు మొండానివీ! సృష్టి మొత్తంబులో శుంఠవీ! ఒరేయ్ పేడ తట్టా!
అరేయ్ చెత్తబుట్టా! ఒరేయ్ గడ్డిపాచా! అరేయ్ నారపీచా! ఒరేయ్ తుప్పు మేకా! అరేయ్ పందితోకా!
ఒరేయ్ వానపామూ! ఇలా తొక్కుతామూ! ఒరేయ్ గౌడి గేదే! ఇదే బడితె పూజా! సెంటిమెంటన్నదే లేని
ఒరేయ్ పెంటాసురా! నిన్ను తిట్టంగ నేనెంత వాడన్, దురాత్మా! ఏడేడు లోకాల భాషలకు శోషొచ్చి
మూర్ఛిల్లురా! మహా బండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా! చావరా, ఓ బోడి వెధవా!
చావరా, ఓ అంట్ల వెధవా! చావరా, నెలతక్కువెధవా! వెదవన్నరెధవా! ముప్పావు వెధవా! పరిపూర్ణ
వెధవా! చావరా! చావరా! చావు, చావు, థూii
"ష్ గప్ చుప్"
2.
"రూపాయి దండకం"
:చిత్రం: "పెళ్ళాం పిచ్చోడు"
(2005)
రూపాయివే! విశ్వరూపమ్ము దాల్చినావే!
దాసోహమే, నీకు దేశదేశాల వారే!
లోకాన జీవనాధారమ్ము నీవే!
నమస్తే నమస్తే రూపాయి నోటూ!
జై రూపాయి!!
జగత్తంత నీ చుట్టు తిరుగున్ కదా! నీవు తోడున్న రాదులే
యే ఆపదా! నీవు లేకున్న మనిషికీ బ్రతుకే వృధా! నీవు యేదన్న వెంటనే జరుగున్ కదా! యెట్టి
దైవమ్ము కానిమ్ము నీకన్నయున్ గొప్పదా? నిన్ను శరణనక మెతుకైన పుట్టదు కదా! నీలోని నిగనిగలు
ఆడోళ్ళకే నగలు, నీవున్న ధగధగలు, లేకున్న భగభగలు, నీపైన ఆధార పడ్డాయి మా బ్రతుకులూ!
రూపాయి, నీ చేయి తాకంగనే హాయి నొందున్ జనాలందరున్! మనీ వున్న వాడే మనీషీ, రుషీ, కళాకారుడూ, ధీరుడూ! మనీ వుంటె, ఆ నింగి దిగి వచ్చి
అవుతుంది, జాబిల్లి నీ ప్రేయసీ! కదలకుండ వుంటె
మనీ, మనుగడే స్వర్గమౌతుందనీ, నేను క్రొత్తగా
చెప్పేది యేముందనీ, మీరు వినుకోండనీ! మీరు వినుకోండనీ!... గబ్బిలం ఫేసు మనిషైన డబ్బుంటె
మన్మధుండౌ! తారు డబ్బాను తలదన్ను పిల్లకే డబ్బుంటె మల్లెపూవౌ! అంట్ల వెధవైన ఆకాశమునకెత్తుచున్,
పెంట వెధవైన ప్రేమించగలరందరున్! పైస లేకుంటె పూజారి దేవుణ్ణి పూజించడూ! ప్రక్కలోకైన
పెండ్లాము రానీయదూ! మనీ లేకుంటె యెవ్వడూ మాట్లాడడూ! ఒక్క రూపాయి నీ జేబులో వున్న చాలున్,
జనాభాలు నీ చుట్టు చేరున్,… సరే యింక చెప్పేది యేముంది?.. ఆపైన కోలాహలమ్ముల్, జోకులున్,
నవ్వులున్, పువ్వులున్, దండలున్, దండముల్,
త్రుళ్ళింతలున్, వంతలున్, మదనగీతమ్ములున్,
మందునాట్యమ్ములున్, బారుమ్రోగేటి చప్పట్లు,
కౌగిళ్ళు, షేకెన్లు, కేరింతలూ, యీలలున్, ముద్దులున్, కాకాలు, బాకాలు, అభినందనల్, నెయ్యముల్,
వియ్యముల్, మాయలున్, మర్మముల్, మంచిగా వంచనల్, ప్రేమగా మోసముల్, నమ్మించి నట్టేట ముంచేయుటల్
వంటి యెన్నెన్నొ తననానా...తనన్ననా....తనన్ననా... తనననా.... సొమ్ము బంధమ్ము ముందున్ మరే బంధమైనన్ మటాషే! అదీ వుత్త గ్రాసే!
కాదన్న క్రాసే! అవునన్న లాసే! అంతయున్ తిరకాసే! అంతా మసే! కసుబుసే! రుసరుసే! శ్రీ కోసమే మేము చేయాలి ప్రతిరోజునూ సర్కసే! నీవు కరుణించినన్
చాలు లైఫంతయున్ సక్సెసే! అర్ధ రూపాయి నా జేబులో వున్న ప్రతివాడికీ అక్కసే! అంత తీవ్రమ్ము
నీసేసకే! నీకు జేకొట్ట నేనెంత వాడన్ ఓ రూపియా!
ఆ!... తల్లి గర్భంబులో బిడ్డ పిండమ్ము రూపమ్ములో నుండు సమయమ్ము నుండియున్ భూమిపై పుట్టేందుకున్
నీవు కావాలి వేవేలుగా! పుట్టాక పెరిగేందుకున్, మందుకున్, మాకుకున్, తిండికిన్, బట్టకున్,
చదువుకున్, పెండ్లికిన్, తిరిగి పుట్టించుకొనుచున్, రోగాలకున్, తుదకు చచ్చేందుకున్,
చచ్చినాకన్ తగులబెట్టేందుకున్, తగులబెట్టాక అస్థికల్ గంగలో కృష్ణలో గోదారి కావేరిలో
కల్పుటకునూ నీవు కావాలిగా దండిగా! కనుక పైకమా! నిత్యమ్ము దయజూపి రక్షింపుమా నన్ను,
ప్రత్యక్షమై సొంతమై!... నా బ్యాంకి అక్కౌంటులో వైటుగా, నే చేయు దానాలలో
బ్లాకుగా, నేనున్న సంఘంబులో నాకు వెయిటుగా, నా వాహనంబెప్పుడూ ఫ్లైటుగా, నాదైన సర్వస్వమున్
బ్రైటుగా, నా మాట లోకానికే స్వీటుగా, నేను యేదన్ననూ స్ట్రైటుగా, అది విన్న వారలకు నో
డౌటుగా, రైటుగా, చరాస్తుల్ స్థిరాస్థుల్ రూపమందున్ కటాక్షింపుమా, నన్ను డెఫినెట్టుగా,
హిట్టుగా! నమస్తే అమెరికా డాలరూ! నమస్తే రష్యా రూబులూ! నమస్తే జపాను యెన్నూ! నమస్తే
లండను పౌండూ! నమస్తే అరబ్బీ దీనార్! నమస్తే ఇండియా రూపాయి! నమస్తే నమస్తే నమస్తే నమఃII
"పెళ్ళాం పిచ్చోడు"
3. "
కాఫీ దండకం" :చిత్రం: "మిథునం" (2012)
అనుదినమ్మును
కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన
పడకున్న పెద్ద చిక్కు
కప్పు
కాఫీ లభించుటె గొప్ప లక్కు
అమృతమ్మన్నది
హంబక్కు అయ్యలార!
జైకాఫి...విశ్వాంతరాళంబులో
నున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ, అందుకే నిన్ను కట్టేసుకుంటాము
మానోటికీ, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ, యెర్లి మార్నింగులో నిద్రలేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్కాఫి కోసమ్ము పెండ్లాముపై ఱంకెలేయించకే బెస్ట్ టేస్టేశ్వరీ
ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫేశ్వరీ,జిహ్వకున్ సిధ్ధి చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ
లోకప్రాణేశ్వరీ ప్రాణదానేశ్వరీ, గంట గంటా ప్రతీయింట ఉప్పొంగవే ఉష్ణపానీశ్వరీ...స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో
నుండి నీ సారమంతా సుతారంగ జారంగ నోరూరుచుండంగ నాసామి రంగా నిజంగానె చచ్చేవిధంగానె ఆ
కాస్త తాగంగ మళ్ళీ పునర్జన్మ వచ్చేవిధంగాను, ప్ప్రొద్దున్నె నీ పొందు లేకున్న మూడంత
పాడయ్యె టైమంత వేస్టయ్యె కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి కాంటాక్ట్స్ సర్వంబు
నాశమ్ము కావించుకుంటారుగా, అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా దాచుకుంటారుగా
కాచుకుంటారుగా చచ్చినట్లింక యిచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా కాఫి! కాఫీని అంతెత్తుపైనుంచి
ఓ కప్పులో వుంచి, ఆకప్పు లోనుంచి ఈ కప్పులోపోసి, అట్నుంచి ఇట్నుంచి, ఇట్నుంచి అట్నుంచి,
బాగా గిలక్కొట్టియున్నుర్గలుప్పొంగగా తెచ్చి ఇస్తారుగా..గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ వరిష్టాలలోనన్
గరిష్ఠంబుగా కాఫి తాగేందుకిష్టంబుగా పోవగా షాపు మూసేయ వాపోవుగా, సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ
శుభాంగీ ప్రభాంగీ నమస్తే నమస్తే నమఃII
"మిథునం"
Amazing and enjoyable scripts
ReplyDelete